Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 14 2021 @ 17:20PM

ఫ్లైఓవర్ పనులు డిసెంబర్ వరకు పూర్తి : జీహెచ్ఎంసీ మేయర్

 హైదరాబాద్: నగరంలో నిర్మిస్తున్న పలు ఫ్లైఓవర్ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలను మేయర్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓవైసీ సంతోష్ నగర్, చాంద్రాయణ గుట్ట, ఫలక్‌నుమా ఫ్లై ఓవర్ పనులను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేస్తామన్నారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement