GHMC fake finger prints case.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-07-14T16:49:01+05:30 IST

GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

GHMC fake finger prints case.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

హైదరాబాద్ (Hyderabad): జీహెచ్ఎంసీ (GHMC) ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసు (fake finger prints case)లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Police) దర్యాప్తు వేగవంతం చేశారు. గోశామహల్ SFA వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని చాధర్ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారు చేశారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్‌లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారు. 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామన్నారు. విచారణ అనంతరం నిందితులను, సీజ్ చేసిన సామాగ్రిని అబిడ్స్ పోలీసులకు అప్పగిస్తామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-07-14T16:49:01+05:30 IST