గ్రేటర్‌లో తక్కువ మెజార్టీతో బయటపడ్డ అభ్యర్థులు వీరే..!

ABN , First Publish Date - 2020-12-06T12:04:12+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు 2016 ఎన్నికల కంటే తక్కువ

గ్రేటర్‌లో తక్కువ మెజార్టీతో బయటపడ్డ అభ్యర్థులు వీరే..!

  • గ్రాఫ్‌ తగ్గింది..!
  • గత ఎన్నికలతో పోల్చితే తగ్గిన మెజార్టీలు
  • ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య ఉత్కంఠపోరు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు 2016 ఎన్నికల కంటే తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. పలు డివిజన్లలో గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. 20డివిజన్లకు పైగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వా.. నేనా అన్నట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 


- బంజారాహిల్స్‌ డివిజన్‌లో 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  కార్పొరేటర్‌ గద్వాల విజయలక్ష్మి 7,507 ఓట్ల ఆదిక్యత సాధించగా ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డిపై 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి 10,225 ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి 9,443 ఓట్లు సాధించారు. 


- వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె కవితారెడ్డి 2016 ఎన్నికల్లో 8,181 ఓట్ల మెజార్టీ సాదించగా ప్రస్తుత ఎన్నికల్లో 7,060 మెజార్టీతో గెలుపొందారు.


- జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాజా సూర్యనారాయణ 2016 ఎన్నికల్లో 4,039 ఓట్ల ఆదిక్యత సాధించగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకటేష్‌ చేతిలో 779 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 


- గాజులరామారం డివిజన్‌లో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరికి 2016 ఎన్నికల్లో 9,480 ఆదిక్యత సాధించగా ఈ ఎన్నికల్లో 436 ఓట్ల ఆదిక్యతతో శేషగిరి విజయం సాధించారు. 


- కొండాపూర్‌ బీజేపీ అభ్యర్థి రఘునాథ్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హమీద్‌పటేల్‌ ఈ ఎన్నికల్లో 4,008 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో 7,334 ఆదిక్యతతో హమీద్‌పటేల్‌ గెలుపొందారు. 


- మాదాపూర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణయాదవ్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వి.జగదీశ్వర్‌గౌడ్‌ గత ఎన్నికల్లో 6,005 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ప్రస్తుత ఎన్నికల్లో 6,096 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 


- హఫీజ్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పూజిత జగదీశ్వర్‌గౌడ్‌ గత ఎన్నికల్లో 8,619 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ప్రస్తుత ఎన్నికల్లో 5,293 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Updated Date - 2020-12-06T12:04:12+05:30 IST