ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-12-04T12:52:40+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీస్‌ ...

ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కిలోమీటర్‌ మేర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పౌరులు, కార్యకర్తలు ఎవరూ గుంపులు గుంపులుగా గుమికూడవద్దు. ఇదిలా ఉండగా కౌంటింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్దకు వచ్చే అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం కల్పించినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.


సైబరాబాద్‌ పరిధిలో...

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ జారీ చేసిన ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. లేని వారికి ప్రవేశం లేదన్నారు. కౌంటింగ్‌ విధుల్లో ఉండే సిబ్బంది తప్పనిసరిగా ఐడీకార్డు లు వెంట తెచ్చుకోవాలన్నారు.

కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. 

రిషీ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి బ్రౌన్‌బీర్‌ బేకరీ జంక్షన్‌ మీదుగా సమతానగర్‌ వైపు వాహనదారులను అనుమతించరు.

అల్లాపూర్‌ జంక్షన్‌, నిజాంపేట రోడ్‌, శ్రీనివాస స్టేషనరీ షాపు, ప్రగతినగర్‌ రోడ్డు, భాగ్యనగర్‌ హిల్స్‌, కూకట్‌పల్లి నుంచి రిషి ఇంజనీరింగ్‌ కాలేజీ వైపు వెళ్లేవారికి అనుమతి లేదు. 

కోనసీమ వంటిళ్లు జంక్షన్‌ నియర్‌ రచ్చబండ గ్రౌండ్‌ ఎంఎన్‌ఆర్‌ కాలేజీ మీదుగా రిషి ఇంజనీరింగ్‌ కాలేజీకి వెళ్లే వాహనదారులకు అనుమతి లేదు. 

చందానగర్‌లోని పీజేఆర్‌ స్టేడియం కౌంటింగ్‌ కేంద్రం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు...

 సరస్వతి విద్యామందిర్‌ జంక్షన్‌ నుంచి పైప్‌లైన్‌ రోడ్‌ చందానగర్‌ గీతాటాకీస్‌ మీదుగా..పీజేఆర్‌ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు.

హుడా కాలనీ జంక్షన్‌ నుంచి పీజేఆర్‌ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు.

శివాజీనగర్‌ ప్రైమరీ స్కూల్‌ జంక్షన్‌ నుంచి వీకర్స్‌ సెక్షన్‌ కాలనీ చందానగర్‌ నుంచి పీజేఆర్‌ స్టేడియం వైపు వాహనదారులను అనుమతించరు. 

ఆయా ప్రాంతాల్లోని వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-12-04T12:52:40+05:30 IST