రసాభాసగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-12-18T22:15:36+05:30 IST

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరిగింది. నిధుల సేకరణపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

రసాభాసగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరిగింది. కాగా నిధుల సేకరణపై  టీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో సమావేశం రసాభాసగా జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్పొరేట్ల ప్రసంగిస్తుడడంతో బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కేసీఆర్‌ నిధులు ఇస్తున్నారన్నట్టు టీఆర్ఎస్ నేతలు మాట్లాడొద్దని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడంపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోడియం దగ్గర బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల పోటాపోటీగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు మధ్య విభేదాలు తలెత్తడంతో కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ విజయలక్ష్మి త్వరగా ముగించారు. 

Updated Date - 2021-12-18T22:15:36+05:30 IST