Abn logo
Jan 25 2021 @ 06:30AM

ట్రాక్టర్లకు డీజిల్ పోయొద్దని పోలీసులు ఇచ్చిన నోటీసు ఉపసంహరణ

ఘాజిపూర్ (ఉత్తరప్రదేశ్): కేంద్ర చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీ తీయనున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు పెట్రోలు పోయవద్దని ఘాజిపూర్ పోలీసులు పెట్రోలు పంపుల యజమానులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నారు. జనవరి 26వతేదీన ట్రాక్టరు ర్యాలీలో పాల్గొనకుండా నివారించేందుకు ట్రాక్టర్లకు డీజిల్ పోయవద్దని కోరుతూ పెట్రోలు పంపులకు నోటీసులు జారీ చేశామని ఘాజిపూర్ పోలీసులు చెప్పారు. దీంతోపాటు ట్రాక్టరు కవాతుకు వెళ్లకుండా రైతులను అడ్డుకునేందుకు యూపీ పోలీసులు వారిని గృహనిర్బంధంలో ఉంచారు.జనవరి 26వతేదీన ట్రాక్టరు ర్యాలీ సందర్భంగా హైఅలర్ట్ జారీచేశారు. 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు 22 వతేదీ నుంచి 26వతేదీ వరకు ట్రాక్టర్లలో, సీసాల్లో డీజిల్ పోయరాదని పోలీసులు ఆదేశించారు.ట్రాక్టర్లకు డీజిల్ పోయరాదని ఘాజిపూర్ జిల్లా సుహ్వాల్ పోలీసులు పెట్రోల్ పంపులకు పొరపాటున నోటీసులు జారీ చేశారని, దీన్ని వెనక్కి తీసుకున్నట్లు యూపీ పోలీసులు వివరించారు.

Advertisement
Advertisement
Advertisement