స్వచ్ఛంద సంస్థ పేరుతో జాతీయ రహదారిపై యువతుల హల్‌చల్

ABN , First Publish Date - 2021-03-01T21:15:08+05:30 IST

ఘట్‌కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న యువతులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వచ్ఛంద సంస్థ పేరుతో జాతీయ రహదారిపై యువతుల హల్‌చల్

మేడ్చల్: ఘట్‌కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న యువతులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు జాతీయ రహదారిపై వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై ఇది చోటు చేసుకుంది. ఐదు బృందాలుగా ఏర్పడిన ఆరుగురు అమ్మాయిలు, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని.. డబ్బులు ఇవ్వని వాళ్ళను బెదిరిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-03-01T21:15:08+05:30 IST