టీఆర్‌ఎ్‌సకు ఘట్‌కేసర్‌ ఎంపీపీ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-08-14T07:47:05+05:30 IST

మేడ్చల్‌ జిల్లాలో టీఆర్‌ఎ్‌సకు షాక్‌ తగిలింది. ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్లు ప్రకటించారు.

టీఆర్‌ఎ్‌సకు ఘట్‌కేసర్‌ ఎంపీపీ గుడ్‌బై

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం!

ఎంపీపీతో భేటీ అయిన ఈటల 


ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జిల్లాలో టీఆర్‌ఎ్‌సకు షాక్‌ తగిలింది. ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్లు ప్రకటించారు. శనివారం బీజేపీ ఎమ్యెల్యే ఈటల రాజేందర్‌ జిల్లా పార్టీ నేతలతో కలిసి సుదర్శన్‌రెడ్డితో అవుషాపూర్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను టీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెబుతున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. వారం రోజుల్లో ఘట్‌కేసర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, పరిషత్‌లకు నిధులు మంజూరు చేయాలని ఆరు నెలలుగా మంత్రి మల్లారెడ్డితో పాటు.. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నా ఫలితం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదని, అందుకే టీఆర్‌ఎ్‌సను వీడాల్సి వచ్చిందని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఈటలను కలిసిన వారిలో టీఆర్‌ఎ్‌సకు చెందిన స్థానిక సర్పంచ్‌ ఏనుగు కావేరీ మశ్చేందర్‌రెడ్డి, మర్రిపల్లిగూడ ఉపసర్పంచ్‌ మాయ నరేష్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


స్థానిక సంస్థలు నిర్వీర్యం: ఈటల  

సీఎం కేసీఆర్‌ ఏలుబడిలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డిని కలిసిన అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు గుర్తింపు లేకుండా చేశారన్నారు. ఎంతోమంది సర్పంచులు గ్రామాల్లో చేయించిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 

Updated Date - 2022-08-14T07:47:05+05:30 IST