ఇనుపాముల గుట్టపైకి ఘాట్‌రోడ్డు

ABN , First Publish Date - 2022-05-28T06:42:20+05:30 IST

ఇనుపాములలోని మల్లన్నగుట్టపై ఘాట్‌ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే లింగయ్య తెలిపారు.

ఇనుపాముల గుట్టపైకి ఘాట్‌రోడ్డు
పనులను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

 జడ్పీ చైర్మన నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కేతేపల్లి, నార్కట్‌పల్లి, మే 27: ఇనుపాములలోని మల్లన్నగుట్టపై ఘాట్‌ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే లింగయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని ఇనుపాముల గ్రామ శివారులో 65వ నెంబర్‌ జాతీయ రహదారి వెంట గల మల్లన్నగుట్టపై జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. గు ట్టపై ఆలయం, ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన ఘాట్‌రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు గుట్టపైకి వెళ్లేందుకు తొలుత ఫార్మేషన్‌ రోడ్డు, ఆ తర్వాత సీసీ, బీటీతో పూర్తి స్థాయి ర హదారిని నిర్మించనున్నారు. దాదాపు రూ.20 లక్షలతో చేపట్టిన ఫార్మేషన్‌ రోడ్డు పనులు ప్రస్తుతం యంత్రాల సాయంతో జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే లింగయ్య ఆర్‌అండ్‌బీ ఈఈ తిరుపతయ్య, ఇన్‌చార్జి డీఈ విష్ణువర్ధన్‌లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆలయ చైర్మన కానుగు యాదగిరిగౌడ్‌, సర్పంచ్‌ జె.వెంకట్‌రెడ్డి, నాయకులు పి.ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, లింగయ్య, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.   నీళ్లు... నిధులు... నియామకాల కోసం పోరాడి సాధించిన తె లంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. మండలంలోని జువ్విగూడెం గ్రామం లో రూ.1.20 కోట్లతో వేయనున్న బీటీ రోడ్డు, నక్కలపల్లిలో సుమా రు రూ.82.50లక్షల వేయనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రపంచమే అబ్బురపడే లా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు, సంపద పెంచి నిధుల ను... ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పనతో నియామకాలను సాధించి తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన ఘనత తమదేనన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటుతోనే పల్లెలు సుభిక్షంగా మారాయన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మా యమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బైరె డ్డి కరుణాకర్‌రెడ్డి, బసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచలు సూదిరెడ్డి ప్రేమలత, ఈద మాధవి నర్సింహ, ఎంపీటీసీలు అంజయ్య, దేవకమ్మ, రాజిరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన బండా జగన్మోహనరెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-28T06:42:20+05:30 IST