Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలుగు సినీరంగ గాన శిఖరం ‘ఘంటసాల’

సీనియర్‌ సినీ నటి శివపార్వతి

 

 

ఒంగోలు(కల్చరల్‌), డిసెంబరు 4: తెలుగు సి నీరంగ గానశిఖరం ఘంటసాల వెంకటేశ్వరరావు అని సీనియర్‌ సినీ, రంగస్థల నటి, నంది అవా ర్డు గ్రహీత శివపార్వతి పేర్కొన్నారు. అక్కినేని కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఒంగో లులోని సీవీఎన్‌ రీడింగ్‌రూం ఆవరణలో జరిగిన ఘంటసాల శతజయంతి వేడుకలకు ఆమె ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ పార్వతి మాట్లాడుతూ తాను రంగస్థలం నుంచి సినీ రంగానికి వచ్చి దాదాపు 200 చిత్రాలలో న టించినట్లు చెప్పారు. నటులకు రంగస్థలం అమ్మ లాంటిదని, అటువంటి నాటకరంగాన్ని పరిరక్షిం చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.     ఈ సందర్భంగా ఘంటసాల పురస్కారంతో ఆమె ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్య క్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం జవహర్‌, ఏజీఎం చంద్రశేఖర్‌, ఇండ్ల రామయ్య, పరిషత్‌ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య, ప్రరసం అధ్యక్షు డు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, గాయకులు ఐ.మురళీకృష్ణ, కొమ్మూరి విజయ్‌, అప్పిశెట్టి రత్త య్య, ఏల్చూరి అనంతలక్ష్మి, పూర్ణిమ, శైలజ తది తరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా సంగీత కళాకారుల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సీవీఎన్‌ రీడింగ్‌ రూము ఆవరణలోని ఘంటసా ల విగ్రహానికి గాయకులు, సంగీత కళాకారులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్య క్షుడు పెండ్యాల సాయిమాస్టర్‌, ఐ.నరసింహారా వు, అప్పిశెట్టి రత్తయ్య, వేణుమాస్టర్‌, మువ్వా నా గేశ్వరరావు, శ్రీవర్షిణి, నాగేంద్రమ్మ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement