ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ చేపట్టిన Signature Campaign కు అనూహ్యస్పందన!

ABN , First Publish Date - 2022-04-20T03:43:03+05:30 IST

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ చేపట్టిన Signature Campaign కు అనూహ్యస్పందన!

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ చేపట్టిన Signature Campaign కు అనూహ్యస్పందన!

వివరాలకు వెళ్ళేముందు దయచేసి ఈ లంకె ను నొక్కి మీ మద్దతు తెలియ చేయండి:

https://www.change.org/BharatRatnaforGhantasala 


అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 70 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు వ్యాఖ్యాతగా 17 ఏప్రిల్ 2022  నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో భారతదేశం నుంచి నంది అవార్డు గ్రహీత, ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ముఖ్య అతిథిగా, గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డా. పార్వతి రవి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.  


మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల పాటలు విని పెరిగామని, వారు లేని లోటును ఎవరు భర్తీ చేయలేరని అన్నారు. ఘంటసాల అంటే గాంధారం అని మాధవపెద్ది అంటే మధ్యమం అని, దాని పక్కనే ఉండేదే పాంచమం అని, ఆ పాంచమమే పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అంటూ వారి మధ్య అనుబంధాన్ని తెలియచేసారు. అలాగే ఘంటసాలకు మాధవపెద్ది కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. వారి పాటలలోని వైవిధ్యాన్ని ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో 1000  సంవత్సరాలు తరువాత కూడా ఎవరు వారి లాగా పాడలేరని తెలిపారు.  పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ..  ఘంటసాల కుటుంబానికి  కోడలు అవ్వడం తన పూర్వజన్మ అదృష్టం అని తేలిపారు.  నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నానికి అభినందిస్తూ మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని, భారత ప్రభుత్వం అతిత్వరలోనే వారికి భారతరత్న బిరుదుతో సత్కరించాలని  ఆకాంక్షించారు.   


యు.యెస్.ఏ నుంచి ఆపి (AAPI) అధ్యక్షులు డా. అనుపుమ గోటిముకుల,  విద్యావేత్త, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై నుంచి తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), బోత్సవాన నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి  ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు పాల్గొని ఘంటసాల పాటలపై తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.  ఘంటసాలకు ఇప్పటికీ భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు.  ఈ దిశగా విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు అన్నిటినీ కూడా ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు సమిష్టిగా కృషి చేయాలని  తెలిపారు. 


ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల  సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి గారు అందిస్తున్నారు. ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. 


        ఈ బృహత్ కార్యక్రమానికి ఈ లింక్ ద్వారా మద్దతు తెలియజేయాల్సిందిగా మనవి



Updated Date - 2022-04-20T03:43:03+05:30 IST