‘గని’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా నటిస్తో్న్న స్పోర్ట్స్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  రెనైసెన్స్ అండ్ అల్లు బాబీ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ పంచ్ రివీల్ అయిన సంగతి తెలిసింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇక ఈ నెల 26న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. గని యాంథెమ్ పేరుతో వస్తోన్న ఈ సాంగ్ ఈ సినిమాకి సిగ్నేచర్ కాబోతోంది. వరుణ్ తేజ సరికొత్త లుక్ తో విడుదలైన పోస్టర్ తో ట్విట్టర్ లో ఈ  విషయాన్ని తెలియచేశారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. మరి గని యాంథెమ్ ఏ స్థాయిలో జనాల్లోకి వెళుతుందో చూడాలి. 


Advertisement