ఘనంగా ఖాదర్‌బాషా దర్గా గంధోత్సవం

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఖాదర్‌బాషా రహెమూతుల్లా ఆ లై దర్గా గంధోత్సవాన్ని సోమవారం రాత్రి ఘనం గా నిర్వహించారు.

ఘనంగా ఖాదర్‌బాషా దర్గా గంధోత్సవం
ఖాదర్‌బాషా గంధోత్సవాన్ని నిర్వహిస్తున్న మత పెద్దలు, ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు

- నేడు ఉత్సవాలకు హాజరుకానున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

కొల్లాపూర్‌, మార్చి 1 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఖాదర్‌బాషా రహెమూతుల్లా ఆ లై దర్గా గంధోత్సవాన్ని సోమవారం రాత్రి ఘనం గా నిర్వహించారు. సాయంత్రం కొల్లాపూర్‌ పట్ట ణంలోని జామే మసీద్‌లో ముస్లిం మత పెద్దలు హాఫీజ్‌, షేక్‌, ఆరీఫ్‌, ఉస్తారీ ఆధ్వర్యంలో దర్గా గంధోత్సవం ఏర్పాట్లను నిర్వహించారు. జామే మ సీద్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధోత్స వాన్ని వాహనంపై ఉంచి పట్టణ పురవీధుల గుం డా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఖాద ర్‌భాషా దర్గాలో ప్రత్యేక ప్రార్థలు నిర్వహించారు. నేడు ఖాదర్‌భాషా దర్గా ఉర్సు ఉత్సవాలను ని ర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ఆలీ, వ్యవసా య మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితోపాటు వివిధ పార్టీల నా యకులు పాల్గొంటారని, హైదరాబాద్‌ ఖవ్వాలీ కళాకారులచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించ బ డుతుందని జామే మసీద్‌ కమిటీ అధ్యక్షుడు అమీనోద్దీన్‌, ఉర్సు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎండి.జాఫర్‌, కరీమోద్దీన్‌, రుక్మద్దీన్‌, ఖాదర్‌భాషా, గఫూర్‌, అజ్మత్‌, మునిసిపల్‌ కౌన్సిలర్‌ షేక్‌రహీం పాషా పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST