Abn logo
Sep 26 2021 @ 00:37AM

ఘనంగా దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతి

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయకు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు


పాడేరు, సెప్టెంబరు 25: పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ 125వ జయంతిని భారతీయ జనతా పార్టీ నేతలు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలో కొత్తపాడేరు, సుండ్రుపుట్టు, కుజ్జెలి, రాములపుట్టు గ్రామాల్లో దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్‌ సేవలను బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అఽధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఈకార్యక్రమంలో బీజేపీ పాంగి రాజారావు, కూడా కృష్ణారావు, నందోలి ఉమామహేశ్వరరావు, కురసా రాజారావు, లకే భాస్కర్‌, గోపాలపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.