జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై వేటు

ABN , First Publish Date - 2020-09-16T17:49:57+05:30 IST

జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభావతిని నియమించారు. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర వైద్య

జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై వేటు

గుంటూరు: జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభావతిని నియమించారు. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నాడు సూపరింటెండెంట్ సుధాకర్‌ తీరుపై ఎమ్మెల్యే ముస్తఫా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ పనితీరు ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో తెల్లారేసరికి సుధాకర్‌పై బదిలీ వేటు పడింది. సుధాకర్‌ను విజయవాడ కోవిడ్ ఆస్పత్రికి బదిలీ చేశారు.

Updated Date - 2020-09-16T17:49:57+05:30 IST