మధురానుభూతులు గుర్తు చేసేదే సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-17T06:49:49+05:30 IST

దూర ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతికి స్వగ్రామం చేరి బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడపడానికి, మధు రానుభూతులను గుర్తు చేసుకునేలా చేసేదే సంక్రాంతి పండుగ అని టీవీ, సినీ నటుడు గెటప్‌ శ్రీను అన్నారు.

మధురానుభూతులు గుర్తు చేసేదే సంక్రాంతి
తాను చదివిన పాఠశాల వద్ద స్నేహితులతో గెటప్‌ శ్రీను

ఆకివీడు రూరల్‌ జనవరి 16 : దూర ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతికి స్వగ్రామం చేరి బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడపడానికి, మధు రానుభూతులను గుర్తు చేసుకునేలా చేసేదే సంక్రాంతి పండుగ అని టీవీ, సినీ నటుడు గెటప్‌ శ్రీను అన్నారు. తన స్వగ్రామమైన ఆకివీడు మండలం కళింగ గూడెం గ్రామంలో ప్రతియేటా జరిగే సంక్రాంతి సంబరాలలో పాల్గొంటానని  అన్నారు. తన స్నేహితులతో కలిసి తాను చదువుకున్న సిద్దాపురం దామోదరం సంజీవయ్య ఓరియంట్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో కొద్దిసేపు సరదాగా గడిపారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు. యర్లపాటి కిషోర్‌, కోమటి వెంకటేశ్వరరావు తదితరులున్నారు. 

Updated Date - 2022-01-17T06:49:49+05:30 IST