Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండో దశ ఉద్యమానికి సిద్ధం కండి


-రేపటి భోజన విరామ సమయం నిరసనను విజయవంతం చేయండి

- ఏపీ జేఏసీ నగరాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పిలుపు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు8: రెండో దశ ఉద్యమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక వర్గాలు సిద్ధం కావాలని ఏపీ జేఏసీ నగర చైర్మన మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎన్జీఓ హోంలోని నగరశాఖ కార్యాలయంలో పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కా ర్మిక సంఘాల నాయకులతో కలిసి రెండో దశ ఉద్యమ కార్యచరణ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్‌, కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యానికి నిరస నగా ఉద్యమం రెండో దశలో భాగంగా... శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లు, కార్మికులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టాలన్నారు. అలాగే సీపీ ఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన తలపెట్టిన వజ్ర సంకల్ప దీక్షను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 13న ర్యాలీ, 16వ తేదీ అన్ని తాలూకాల కేంద్రాల్లో ధర్నాలు, 21వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వానికి మన చూపుదామన్నారు.  సమావేశంలో ఎన్జీఓ నగర కార్యదర్శి శ్రీధర్‌బాబు, ఉపాఽధ్యక్షుడు రమణారెడ్డి, ఉమాశంకర్‌, నాగరాజు, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారా య ణ, జేఏసీ నాయకులు రామ్‌నాథ్‌, భాస్కర్‌, శ్రీనివాసులు, రామాంజనే యులు, దేవేంద్ర, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

వజ్ర సంకల్ప దీక్షను విజయవంతం చేయండి

 జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీన చేపడుతున్న వజ్ర సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ యూఎస్‌ జిల్లా అధ్యక్షుడు బీఎల్‌ వెంక టేష్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోంలోని సమావేశపు హాల్‌లో బుధవా రం దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఏపీ జేఏసీ నగర చైర్మన మనోహర్‌రెడ్డి చేతుల మీదుగా ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌, మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రజాసంకల్ప యాత్రలో ఊరూరా తిరిగి చెప్పిన సీఎం జగన్మోహనరెడ్డి... ఽఅధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా దానిపై నోరు మెదపడం లేదని మం డిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని పాత ఆ ర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగులతో వజ్ర సంకల్ప దీక్షను చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యా యు లు వేల సంఖ్యలో హాజరై దీక్షను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం లో ఏపీసీపీఎస్‌ యూఎస్‌ రాష్ట్ర కార్యదర్శి భాగ్యరాజ్‌, నగర అధ్యక్షుడు నా గభూషణం, నగర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌, రాయలసీమ కన్వీనర్‌ త లమర్ల ప్రభాకర్‌, ఎన్జీఓ నాయకులు రాఘవేంద్ర, రమణారెడ్డి, నాగరాజు, ఉ మాశంకర్‌, రామ్‌నాథ్‌, భాస్కర్‌, శ్రీనివాసులు, దేవేంద్ర, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement