గడ్డి మీద నిలబడద్దు..పక్కకు తొలగండి: ప్రధాని పత్రికా సమావేశంలో కామెడీ!

ABN , First Publish Date - 2020-06-05T02:33:07+05:30 IST

ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రధాని స్కాట్ మారిసన్ ఇటీవల ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.

గడ్డి మీద నిలబడద్దు..పక్కకు తొలగండి: ప్రధాని పత్రికా సమావేశంలో కామెడీ!

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రధాని స్కాట్ మారిసన్ ఇటీవల ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. తన ప్రకటన కోసం మారిసన్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని ఎంచుకున్నారు. అప్పటికే అక్కడికి విలేకరులందరూ వచ్చేశారు. కొద్ది క్షణాలకు అక్కడకు చేరుకున్న ప్రధాని ఉద్దీపన ప్యాకేజీలోని వివరాలను వెల్లడించడం ప్రారంభించారు. అయితే అక్కడికి కొద్ది దూరంలో నిలబడి ఇదంతా చూస్తున్న స్థానికుడొకరు తాను జాగ్రత్తాగా పెంచిన గడ్డినేలపై ప్రధాని నిలబడటాన్ని చూసి ఇబ్బంది పడ్డాడు. దీంతో.. అది ప్రధాని సమవేశమన్న విషయం కూడా లేక్కచేయక.. అందరూ గడ్డి ఉన్న ప్రాంతానికి దూరంగా వెళ్లాలని గట్టిగా అరచి చెప్పాడు. అయితే ఈ చేష్టలోని హాస్యానికి అక్కడున్న వారందరూ పెద్దపెట్టున నవ్వారు. మారిసన్ కూడా స్థానికుడు సూచన మేరకు నవ్వుతూ అక్కడి నుంచి పక్కకి తొలగి తన ప్రకటనను కొనసాగించారు. 


Updated Date - 2020-06-05T02:33:07+05:30 IST