పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలి

పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలి
మాట్లాడుతున్న సంపతిరావు చందన

ఆమనగల్లు, ఆగస్టు 6: నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి సంపతిరావు చందన కోరారు. పట్టణంలోని కళ్యాణి గార్డెన్‌లో శనివారం ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాక్‌ టెస్టు నిర్వహించారు. సర్కిల్‌ పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన 200ల మంది అభ్యర్థులు మోడల్‌ పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శౌర్య పోలీస్‌ అకాడమి డైరెక్టర్‌ నరేశ్‌, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST