Bank Exams: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌‌లో.. మంచి స్కోర్ సాధించండిలా..!

ABN , First Publish Date - 2021-10-18T18:03:59+05:30 IST

బ్యాంక్‌ల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి..

Bank Exams: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌‌లో.. మంచి స్కోర్ సాధించండిలా..!

బ్యాంక్‌ల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి బీఎస్ఆర్‌బీ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే పరీక్షల్లో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ కూడా ఒకటి. కొద్దిపాటి శ్రద్ధ అంతకుమించి ప్రాక్టీస్‌తో ఈ టాపిక్‌లో పట్టు సాధించవచ్చు. అసలు ఇందులో వచ్చే ప్రశ్నల సరళి, స్వరూపాలను ఒకసారి చూద్దాం. 


రీడింగ్‌ కాంప్రహెన్షన్‌..

ఇచ్చిన ఇంగ్లీష్‌ పాసేజ్‌ చదువుకొని, దాని కింద ఉన్న ప్రశ్నలు ఆన్సర్‌ చేయాలి. హైస్కూలు రోజుల నుంచీ వివిధ పోటీ పరీక్షల వరకు అన్నింట్లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ఉంది. జిఆర్‌ఇ, టోఫెల్‌, క్యాట్‌, మ్యాట్‌, క్లాట్‌, సివిల్‌ సర్వీసె్‌స(మెయిన్స్‌) దేనిలో అయినా దీని రూపం ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ఉంటుంది. బ్యాంకు ఎగ్జామ్‌లలో కూడా తప్పకుండా ఉంటుంది. వేగంగా చదవడం, అంతే త్వరితగతిన జవాబులు గుర్తుపెట్టడం ఇందులో ముఖ్యం. ఇందుకోసం ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్‌ చదవడం మొదట అలవాటు చేసుకోవాలి.


ఒకప్పుడు చాలామంది అభ్యర్థులు ఈ భాగాన్ని ఆన్సర్‌ చేయకుండా వదిలేసేవారు. దీనిని ఆన్సర్‌ చేయడమంటే ఎక్కువ సమయం వృథా అవుతుందని భావన. గతంలో ఒక చిన్న పేరాగ్రాఫ్‌ను మాత్రమే ఇచ్చేవారు. అయిదారేళ్ళ క్రితం 1400 ఇంగ్లీష్‌ పదాలు ఉన్న పాసేజ్‌ ఇచ్చారు. ఎక్కువ పదాలు ఉంటే, చదివేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం అయిదు పేరాగ్రాఫ్‌లు ఉన్న ఇంగ్లీష్‌ పాసేజ్‌ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్‌, వ్యాపారం, ఎగుమతులు - దిగుమతులు, రిజర్వేషన్స్‌ మొదలైన అంశాల పైనే పాసేజ్‌లు ఉంటున్నాయి. సాధారణంగా ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్లలో కనిపించే అంశాలే ఉంటున్నాయి. ఆ పాసేజ్‌ కింద సాధారణంగా ఏడు ప్రశ్నలు ఉంటున్నాయి. గతంలో పది ప్రశ్నల వరకు ఉండేవి. ఇచ్చిన పాసేజ్‌ని అర్థం చేసుకొని, అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి.


ఎ)  ఒక ప్రశ్న, పాసేజ్‌లో ఉన్న ఒక ఆంగ్ల పదానికి సమాన అర్థం ఉన్న పదాన్ని కనుగొనడం.

బి)  ఒక ప్రశ్న, పాసేజ్‌లో ఉన్న ఆంగ్ల పదానికి వ్యతిరేక అర్ధాన్ని కనుగొనడం.

సి)  ఒక ప్రశ్న ఇచ్చిన ఇంగ్లీష్‌ పాసేజ్‌కి ‘హెడ్డింగ్‌’ ఏది సరిపోతుందో చెప్పడం.

డి)  మిగిలిన ప్రశ్నలు, ఇంగ్లీష్‌ పాసేజ్‌ని బట్టి లాజికల్‌గా ఆలోచించి సమాధానాలు గుర్తించేవిగా ఉంటాయి. గతంలో ప్రశ్నలు డైరెక్ట్‌గా ఆన్సర్‌ గుర్తించేవిగా ఉండేవి. ప్రస్తుతం ప్రశ్న కింద (ఎ), (బి), (సి) అనే చాయి్‌సలు ఇచ్చి వాటికింద ఎ మాత్రమే కరెక్ట్‌, బి మాత్రమే కరెక్ట్‌, సి మాత్రమే కరెక్ట్‌. బి ్క్ష సి రెండూ కరెక్ట్‌, ఎ ్క్ష సి రెండూ కరెక్ట్‌ అనేవిధంగా అయిదు జవాబు ఆప్షన్లు ఇస్తున్నారు. అందువల్ల ఇంగ్లీష్‌ పాసేజ్‌ చదవడానికి తక్కువ సమయం పట్టినా, ప్రశ్న కింద ఆన్సర్లను లాజికల్‌గా ఆలోచించి గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతోంది. 



ఒక ఇంగ్లీష్‌ వాక్యాన్ని, మధ్యలో బ్లాంక్‌(ఖాళీ)తో ఇచ్చి, దానిని ఆ వాక్యం కింద ఉన్న పదంతో నింపడమే ఇందులోని విధానం. ఆ పదం వెర్బ్‌ కావచ్చు, ప్రిపోజిషన్‌ కావచ్చు. గ్రామర్‌కి సంబంధించిన అంశాలూ కావచ్చు. ఇలాంటివి అయిదు ఉంటాయి. 

- ఎనిమిది వాక్యాలను ఇచ్చి వాటిలో గల గ్రామర్‌కి సంబంధించిన తప్పులను కనుగొనండని అడుగుతారు.

- ఒక ఇంగ్లీష్‌ వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇస్తారు. దీనిని సరైన ఆర్డర్‌లో అరేంజ్‌ చేయాలి. ఇలాంటివి అయిదు వాక్యాలు ఉంటాయి.

- ఒక ఇంగ్లీష్‌ వాక్యాన్ని ఇచ్చి దానిలో కొంత భాగాన్ని బోల్డ్‌గా ఇస్తారు. ఆ బోల్డ్‌గా ఇచ్చిన భాగాన్ని, ఆ ఇంగ్లీష్‌ వాక్యం కింద ఉన్న ఆప్షన్లలో ఏది సరిగ్గా సరిపోతుందో గుర్తించి ఆన్సర్‌గా గుర్తించాలి. కొన్ని సమయాల్లో ప్రశ్నలో ఇచ్చిన ఇంగ్లీష్‌ వాక్యమే బాగుంటే, అదే ఆన్సర్‌గా గుర్తించాలి. ఇలాంటి ప్రశ్నలు అయిదు ఉంటాయి.

- ఒకసారి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ అనే ఆరు ఇంగ్లీష్‌ వాక్యాలు ఇచ్చి, వాటిని ఒక వరుసక్రమంలో (కథల్లో/ వ్యాసం మాదిరిగా) గుర్తించమన్నారు. మరోసారి ఆరు ఇంగ్లీష్‌ వాక్యాలు ఇచ్చిన ఏ వాక్యం 1వది, ఏ వాక్యం 2వది, ఏ వాక్యం 3వది, ఏ వాక్యం 4వది, ఏ వాక్యం 5వది, ఏ వాక్యం 5వది అని గుర్తించమన్నారు.

- క్లోజ్‌ టెస్ట్‌ మరొకటి. అంటే ఒక పెద్ద ఇంగ్లీష్‌ పేరాగ్రాఫ్‌ను అయిదు బ్లాంక్‌(ఖాళీలు)లతో ఇచ్చారు. ప్రతి బ్లాంక్‌కి ఒక నంబరు ఇచ్చారు. ఆ పేరాగ్రాఫ్‌ కింద అయిదు ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో ప్రశ్నలో అయిదు ఇంగ్లీష్‌ పదాలు ఇచ్చారు. పేరాగ్రాఫ్‌లో ఉన్న నంబరు ప్రకారం చూపించిన ప్రశ్నలో గల అయిదు పదాలలో ఏది సరిగా సరిపోతుందో దానిని గుర్తించాలి.


Updated Date - 2021-10-18T18:03:59+05:30 IST