జర్మనీ కీలక నిర్ణయం.. భారత ప్రయాణికులకు ఓ శుభవార్త!

ABN , First Publish Date - 2022-05-26T22:12:42+05:30 IST

కొవాగ్జిన్ కరోనా టీకా తీసుకున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్! ఈ టీకాకు అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

జర్మనీ కీలక నిర్ణయం.. భారత ప్రయాణికులకు ఓ శుభవార్త!

ఎన్నారై డెస్క్: కొవాగ్జిన్ కరోనా టీకా తీసుకున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్! ఈ టీకాకు అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. తద్వారా.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జర్మనీ వెళ్లవచ్చు. కాగా.. ఈ నిర్ణయం పట్ల భారత్‌‌లోని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్.. హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ టీకాల గుర్తింపులేమి కారణంగా వీసా జారీలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ను గుర్తించాలంటూ తమ ప్రభుత్వాన్ని ఎంతోకాలంగా కోరుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాగా.. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నవంబర్‌లోనే అనుమతులు జారీ చేసింది. ఆస్ట్రేలియా, జపాన్,  కెనడా దేశాలు ఇప్పటికే కొవాగ్జిన్ తీసుకున్న భారతీయులను అనుమతిస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి జర్మనీ కూడా వచ్చి చేరింది.



Updated Date - 2022-05-26T22:12:42+05:30 IST