NRI: విదేశీయులకు మూడేళ్లలోనే పౌరసత్వం..జర్మనీ ప్రభుత్వ యోచన

ABN , First Publish Date - 2022-09-10T05:15:45+05:30 IST

వలసల విధానానికి(Immigration) కీలక మార్పులు చేసే క్రమంలో జర్మనీ(Germany) ప్రభుత్వం.. విదేశీయులకు దేశంలో కాలుపెట్టిన మూడేళ్లకే పౌరసత్వం ఇచ్చేందుకు యోచిస్తోంది.

NRI: విదేశీయులకు మూడేళ్లలోనే పౌరసత్వం..జర్మనీ ప్రభుత్వ యోచన

ఎన్నారై డెస్క్: వలసల విధానానికి(Immigration) కీలక మార్పులు చేసే క్రమంలో జర్మనీ(Germany) ప్రభుత్వం.. విదేశీయులకు దేశంలో కాలుపెట్టిన మూడేళ్లకే పౌరసత్వం(Citizenship) ఇచ్చేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా జర్మనీ సమాజంలో సులువుగా ఇమిడిపోయే వారికి ఈ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దేశంలో నెలకొన్న కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రస్తుతం జర్మనీ విదేశీయలు వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఓ అంచనా ప్రకారం..2026 నాటికి 8 కోట్ల మంది కార్మికుల కొరత ఏర్పడనుంది. 


కాగా.. వలసలకు సంబంధించి అధికార లేబర్ పార్టీ ఓ కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. విదేశీయులకు జర్మనీ చదువులు మరింత ఆకర్షిణీయంగా చేయడమే ఈ ప్రతిపాదన  లక్ష్యం. జర్మనీలోని వ్యాపార సంస్థలు తమ ఉనికిని నిలుపుకునేందుకు నిపుణులైన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలీకరణ చేయడం, నికర కర్బన ఉద్గార రహిథ వ్యవస్థలను రూపొందించేందుకు నిపుణులు అవసరం’’ అని జర్మనీ లేబర్ మినిస్టర్ హుబర్టస్ హెయిల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం,  డిజిటలీకరణ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం తమముందున్న సవాళ్లని వివరించారు. ఇందులో భాగంగానే వలసల విధానాలను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

Updated Date - 2022-09-10T05:15:45+05:30 IST