జర్మనీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-04-06T02:18:48+05:30 IST

జర్మనీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,936 కేసు

జర్మనీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,936 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 91,714కు పెరిగింది. అయితే, రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం కొంత ఉపశమనం కలిగించే వార్తే. శుక్రవారం దేశవ్యాప్తంగా 6,174 కేసులు నమోదు కాగా, శనివారం 6,082 కేసులు నమోదయ్యాయి. అంటే శుక్రవారంతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య  5,936 మాత్రమే. అంటే నిన్నటితో పోలిస్తే 146 కేసులు తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా కేసుల సంఖ్య తగ్గడం గమనార్హం. కాగా, గత 24 గంటల్లో 184 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1342కి పెరిగింది. 


Updated Date - 2020-04-06T02:18:48+05:30 IST