జర్మనీలో Permanent residency మరింత సులువు.. కొత్త రెసిడెన్సీ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2022-07-07T17:50:39+05:30 IST

జర్మనీ ప్రభుత్వం బుధవారం విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాసానికి సంబంధించిన కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది.

జర్మనీలో Permanent residency మరింత సులువు.. కొత్త రెసిడెన్సీ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

ఎన్నారై డెస్క్: జర్మనీ ప్రభుత్వం బుధవారం విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాసానికి సంబంధించిన కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో తాత్కాలిక రెసిడెన్సీపై ఉంటున్న సుమారు 1,36,000 మంది విదేశీయులకు లబ్ధి చేకూరనుంది. 2022 జనవరి 1 నాటికి ఎవరైతే ఆ దేశంలో ఐదేళ్ల నుంచి ఉంటున్నారో వారందరికీ పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన గడిచిన ఐదేళ్ల నుంచి సుమారు 1.36లక్షల మంది విదేశీయులు ఆ దేశంలో ఉంటున్నట్లు తేలింది. వీరందరూ కూడా శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ఏడాది కాలానికి రెసిడెన్సీ స్టేటస్ వస్తుంది. 


ఆ తర్వాత మరోసారి దరఖాస్తు చేసుకుంటే పర్మినెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తారు. అయితే, శాశ్వత నివాసాదారులు అక్కడి సమాజంలో కలిసి జీవిచేందుకు తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. "మంచి సంఘటిత వ్యక్తులు మా దేశంలో మంచి అవకాశాలు పొందాలని మేము కోరుకుంటున్నాము. మాకు నైపుణ్యం కలిగిన కార్మికులను మరింత త్వరగా ఆకర్షించాల్సిన అవసరం ఉంది. మాకు చాలా రంగాలలో వారు అత్యవసరంగా అవసరం" అని ఈ సందర్భంగా జర్మనీ అంతర్గత మంత్రి నాన్సీ ఫేజర్ అన్నారు. 

Updated Date - 2022-07-07T17:50:39+05:30 IST