భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌కు జర్మనీ ఆమోదం

ABN , First Publish Date - 2022-05-26T20:48:52+05:30 IST

భారత్ బయోటెక్ రూపొందించిన బయోటెక్ covaxinకు జర్మనీ ఆమోదం లభించింది. జూన్ ఒకటి నుంచి ఈ ఆమోదం అమల్లోకి రానుంది.

భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌కు జర్మనీ ఆమోదం

హైదరాబాద్ : భారత్ బయోటెక్ రూపొందించిన బయోటెక్ covaxinకు జర్మనీ ఆమోదం లభించింది. జూన్ ఒకటి నుంచి ఈ ఆమోదం అమల్లోకి రానుంది. భారత్, భూటాన్‌‌లలోని జర్మన్ రాయబారి వాల్టర్ జె లిండ్నర్ ‘జూన్ 1 నుండి GERMANYకి ప్రయాణించడానికి WHO(world health organization) ఆమోదించిన కోవాక్సిన్‌ను గుర్తించాలని GERMANY ప్రభుత్వం నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఓ ట్విట్‌లో పేర్కొన్నారు. కిందటి సంవత్సరం నవంబరులో, ప్రపంచ ఆరోగ్య సంస్థ Covaxin కోసం అత్యవసర వినియోగ జాబితా(EUL) స్థితిని సిఫార్సు చేసింది.ఆస్ట్రేలియా, జపాన్, కెనడా సహా పలు దేశాలు కోవాక్సిన్‌ టీకాలు వేయించుకున్న ప్రయాణీకులను తమ దేశాల్లోకి  అనుమతిస్తాయి. 

Updated Date - 2022-05-26T20:48:52+05:30 IST