కొవిడ్‌ బాధితుల కోసం అదనపు బెడ్లు

ABN , First Publish Date - 2021-05-18T04:05:53+05:30 IST

ఆస్పత్రులలో మరింతమంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా కేజీహెచ్‌, విమ్స్‌, ఛాతీ ఆస్పత్రులలో జర్మన్‌ హ్యాంగర్స్‌ (టెంట్లు) వెంటనే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ బి.సుధాకర్‌ను కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు.

కొవిడ్‌ బాధితుల కోసం అదనపు బెడ్లు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఇందుకోసం కేజీహెచ్‌, విమ్స్‌, ఛాతీ ఆస్పత్రుల్లో జర్మన్‌ టెంట్లు

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

మహారాణిపేట, మే 17: ఆస్పత్రులలో మరింతమంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా కేజీహెచ్‌, విమ్స్‌, ఛాతీ ఆస్పత్రులలో జర్మన్‌ హ్యాంగర్స్‌ (టెంట్లు) వెంటనే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ బి.సుధాకర్‌ను కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం వైద్య, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచామని, ఈనెల 20న బిడ్స్‌ తెరిచి  అర్హులకు పనులు కేటాయిస్తామని తెలిపారు. కేజీహెచ్‌లో వంద పడకలు, విమ్స్‌లో వంద పడకలు, ఛాతీ ఆస్పత్రిలో 50 పడకలు సమకూరేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎం.అరుణబాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T04:05:53+05:30 IST