2023 నాటికి జియో అండర్‌సీ కేబుల్‌ రెడీ

ABN , First Publish Date - 2021-05-18T06:04:14+05:30 IST

ప్రముఖ అంతర్జాతీయ భాగస్వాములు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ సరఫరా సంస్థ సబ్‌కామ్‌ భాగస్వామ్యంలో సముద్రగర్భంలో భారత్‌ అంతటా విస్తరించేలా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది

2023 నాటికి జియో అండర్‌సీ కేబుల్‌ రెడీ

న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ భాగస్వాములు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ సరఫరా సంస్థ సబ్‌కామ్‌ భాగస్వామ్యంలో సముద్రగర్భంలో భారత్‌ అంతటా విస్తరించేలా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. నానాటికీ పెరుగుతున్న డేటా డిమాండును తట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుందం టూ ఈ కేబుల్‌ వ్యవస్థ సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇట లీ, మధ్య, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల మీదుగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్లతో భారత్‌కు అనుసంధానత కల్పిస్తుందని తెలిపింది.  2023 ద్వితీయార్ధం నాటికల్లా భారత్‌-ఆసియా ఎక్స్‌ప్రెస్‌ (ఐఏఎక్స్‌) సిస్టమ్‌ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్‌ జియో పేర్కొంది. 

Updated Date - 2021-05-18T06:04:14+05:30 IST