Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 23 Jan 2022 13:04:17 IST

'జెంటిల్ మేన్ 2': మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి

twitter-iconwatsapp-iconfb-icon
జెంటిల్ మేన్ 2: మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి

'జెంటిల్ మేన్ 2' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నారు. క్రియేటివ్ జీనియస్ శంకర్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల  క్రితం వచ్చి సంచలన విజయం అందుకున్న 'జెంటిల్ మేన్' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. నిర్మాత కే టి కుంజుమోన్ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించి కూడా చాలా నెలలవుతోంది. ఇన్నాళ్ళు ఎలాంటి అప్‌డేట్ లేని 'జెంటిల్ మేన్ 2' మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ చిత్రానికి లెజండరీ సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణిని ఎంచుకున్నారు. స్వయంగా చిత్ర నిర్మాత కుంజుమోన్ కీరవాణిని కలిసి ఈ సినిమాకి సంగీతం అందించమని అడిగి ఒప్పించారట.  

పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జెంటిల్‌మేన్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పనిచేయనున్న సంగీత దర్శకుడు పేరు ఊహించి కరెక్టుగా చెప్పిన వారికి బంగారం నాణేలను బహుమతిగా అందజేస్తామని కేటీ కుంజుమన్‌ తెలిపారు. ఆ విధంగానే విన్నర్‌కు త్వరలో బంగారం నాణేలను బహుమతిగా అందజేయనున్నారు. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కూడా ఇదే విధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International