తరం అంతరం నేటి పిల్లల్లో...

ABN , First Publish Date - 2021-01-11T06:00:09+05:30 IST

నేటి టీనేజ్‌ పిల్లల్లో 49 శాతం మంది తల్లిదండ్రులతో తమ ఆలోచనలను, అనుభూతులను హాయిగా పంచుకోలేకపోతున్నారని ఒకసర్వేలో వెల్లడైంది. వీళ్లల్లో 68

తరం అంతరం  నేటి పిల్లల్లో...

నేటి టీనేజ్‌ పిల్లల్లో 49 శాతం మంది తల్లిదండ్రులతో తమ ఆలోచనలను, అనుభూతులను హాయిగా పంచుకోలేకపోతున్నారని ఒకసర్వేలో వెల్లడైంది. వీళ్లల్లో 68 శాతం మంది రిలేషన్‌షిప్‌ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.  53 శాతం మంది తమ విషయాలను బయటపెట్టకుండా గోప్యంగా తమలోనే దాచుకుంటున్నారు. ఫలితంగా యాంగ్జయిటీ, ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనవుతున్నారు.


ఈ సర్వే నేటి యువత ఆలోచనాధోరణులను వెల్లడిస్తోంది. తల్లిదండ్రులతో తమ మనోభావాలను చెప్పుకోలేని స్థితిలో  పిల్లలు ఉండడం  ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు తమ రిలేషన్‌షిప్స్‌ గురించి తల్లిదండ్రులకు చెబితే ఎలా స్పందిస్తారనే సరళి కూడా ఇప్పటి పిల్లల్లో కనిపిస్తోందని  సర్వే తేల్చింది. తరాల అంతరాల వల్ల తల్లిద ండ్రులు, పిల్లల మధ్య కమ్యూనికేషన్‌ అంతరం పెరిగిపోతోందని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. పెరుగుతున్న పిల్లలు తమ ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోలేకపోవడానికి ఇది ప్రధాన కారణంగా తేలింది.


మరోవైపు 70 శాతంమంది యువత తమ ఆలోచనలను పేరెంట్స్‌తో పంచుకుంటామని, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత విస్తృతం చేసుకుంటున్నామని చెబుతున్నారు. తమ రిలేషన్‌షిప్స్‌ గురించి కూడా స్వేచ్ఛగా అమ్మానాన్నలతో మాట్లాడతామని చెప్పారు. 92 శాతంమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి బెరుకుతనం లేకుండా అన్ని విషయాలూ తమతో హాయిగా పంచుకుంటున్నారంటున్నారు.


72 శాతంమంది తల్లిదండ్రులు తమకు, తమ పిల్లలకు మధ్య ఎలాంటి వయసు అంతరాల అడ్డు ఎప్పుడూ తలెత్తలేదని అన్నారు. ప్రధానంగా రిలేషన్‌షిప్‌ సంబంధాలను స్వేచ్ఛగా తల్లిదండ్రులతో పిల్లలు చర్చించే వాతావరణం  ఇంట్లో ఉంటే ఒత్తిడి, డిప్రెషన్‌, యాంగ్జయిటీ వంటివి వాళ్లలో తలెత్తవు.   


Updated Date - 2021-01-11T06:00:09+05:30 IST