సాధారణ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-01-21T05:51:25+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుశీల అధ్యక్షతన జరిగింది.

సాధారణ సర్వసభ్య సమావేశం
సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు

- మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం


రాజాపూర్‌, జనవరి 20 : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుశీల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో ఎజెండా అంశంలో ప్రగతి నివేదికలు ఆయా శాఖలకు చెందిన అధికారులు వివరాలు తెలియజేయడంతో సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు సమీక్ష నిర్వహించి, సమాధానాలు అధికారులు వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, తహసీల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో రాములు, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీపీ సుశీల ముఖ్య అతిథులుగా పాల్గొని సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. 


అర్హులు బూస్టర్‌ డోస్‌ టీకా వేయించుకోవాలి


అర్హులైన ప్రతీ ఒక్కరూ బూస్టర్‌ డోస్‌ కరోనా టీకాను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మండల పరి షత్‌ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన క్యాంప్‌ వద్ద ఆయన, సుశీల రమేష్‌ నాయక్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పాత్రికేయులు, నాయకులు బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. కార్య క్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, మండల వైద్యాధికారి ప్రతాప్‌ చౌహాన్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:51:25+05:30 IST