Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

General Lifestyle: జీవితాన్ని మెరుగుపరిచే 7 అలవాట్లు..

twitter-iconwatsapp-iconfb-icon
General Lifestyle: జీవితాన్ని మెరుగుపరిచే 7 అలవాట్లు..

ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని క్రమబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చక్కని జీవన శైలిని ఆచరణలో ఉంచేందుకు విఫల ప్రయత్నాలెన్నో చేస్తుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అవసరం. కరోనా తరువాత ప్రతి ఒక్కరిలోనూ కాస్త కష్టపడినా  నీరసం, శక్తి లేకపోవడం తరచుగా అనారోగ్య బారిన పడటం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఈ గందరగోళంలో కొన్నిసార్లు చేస్తున్న ఉద్యోగం, వ్యక్తిగత సంబంధాలను బ్యాలెన్స్ చేయడానికి మానసిక ఆరోగ్యంతో పాటు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే పట్టుదల కావాలి. కొన్ని పరిస్థితులు మనకు లేని ఒత్తిడిని తెచ్చి పెట్టచ్చు. కొత్త అలవాట్లు, పాత ఆలోచనలు మన నుంచి దూరంగా పెట్టడం వల్ల జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతాం.


1. ఈ ఇంతా అవసరమే..అనుకోండి.

శరీర ఆరోగ్యానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించడం, జిమ్‌కి వెళ్లడం, ఇంట్లో రాత్రి భోజనం చేయడం మొదలైన వాటితో పాటు, శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం, సినిమా లేదా షో చూడటం, స్నేహితులను కలవడం మొదలైన చేయడం ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.


2. సాకులు వెతక్కండి.

సాధారణంగా, ఏ పనినైనా చేయాల్సి వస్తే.. నేను చేయలేనని.. ఇప్పుడు నా వల్ల కాదని.. "నేను అలసిపోయాను," "నాకు సమయం లేదు," "నేను రేపు చేస్తాను," వంటి సాకులు చెపుతుంటాం. ప్రతి దానికి ఇతరులను నిందించడం మానేసి, మీ జీవితం, మీ పనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, మీ స్వంత మార్గానికి బాటలు వేయండి.


3. వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపండి.

ఎవరి గురించో ఎవరో చెపుతుంటే మీరు చెవి వేయకండి. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూసే ధోరణి చేటు తెచ్చిపెడుతుంది. ఉచిత సలహాలను ఇవ్వడం, తీసుకోవడం లాంటివి అదుపులో ఉంటే మంచిది. ఎదుటివారు చెప్పింది బహుశా అసత్యం, అసంబద్ధం కావచ్చనేది ఆలోచించండి. 


4. వ్యాయామం చేయండి.

రోజూ ఉదయాన్నే వ్యాయామానికి వెళ్లండి. ఈ అలవాటు ఒత్తిడిని దూరం చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత, ఆలోచనలు మరింత స్థిరంగా ఉంటాయి. మనస్సు పదునుగా ఉంటుంది. ఆందోళన స్థాయి మునుపటి కంటే తక్కువగా ఉంటుంది. 


5. పరధ్యానాలను వదిలేయండి.

తరచుగా సోషల్ మీడియాను వాడటం, ఫోన్ చూడటానికి ఓ టైం అంటూ ఉండకపోవడం వాటి కోసం ఎక్కువ సమయం గడుపుతున్నట్టు  గమనించినట్లయితే, ఈ అలవాట్లను దూరం చేసుకోవడానికి మరో వ్యాపకాన్ని ఎంచుకోండి. అది మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండటంతోపాటు అలవాటైన ఫోన్ కంటే కూడా ఉత్సాహంగా ఉంచేదిగా చూసుకోండి. 


6. బాధితుడిగా ఆలోచించకండి.

జీవితంలో జరిగే చాలా వాటికి మనం కారణం కాదనే స్పృహతో ఉండటం చాలా అవసరం. మన జీవితానికి మనమే కారణమనే ఆలోచనలో ఉండటం అవసరం. దీనికి ఇతరులను నిందించడం మానేయండి. 


7. భయాన్ని ఎదుర్కోండి.

గొప్ప విజయాన్ని సాధించిన ఏ వ్యక్తి అయినా మొదట విఫలాన్ని చూడకపోడు.. దానికే నిరాశ చెంది ఏదో కోల్పోయినట్టు ఉండిపోవాల్సిన పనిలేదు. కొన్నిసార్లు కొత్త ప్రయత్నం చేయడానికి భయపడితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరగకుండా ఆపినవాళ్ళవుతారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఫ్యామిలీ కౌన్సిలింగ్Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.