జనరల్‌ ఆస్పత్రి కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2021-06-24T05:26:36+05:30 IST

వేతనాలు పెంచాలని రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జనరల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, సెక్యూరిటీ, సూపర్‌వైజర్‌ కార్మికులు, పేషెంట్‌కేర్‌ అటెండర్లు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

జనరల్‌ ఆస్పత్రి కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలుపుతున్న కార్మికులు

 మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) జూన్‌ 23: వేతనాలు పెంచాలని రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జనరల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, సెక్యూరిటీ, సూపర్‌వైజర్‌ కార్మికులు, పేషెంట్‌కేర్‌ అటెండర్లు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన 9వ రోజుకు చేరింది. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలలు కంటున్న బంగారు తెలంగాణలో కార్మికులు అర్ధాకలితో అలమటించే దుస్థితి ఏర్పడిందన్నారు. సీఎం నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు తమ వేతనాలు పెంచుకుంటున్నారుగానీ కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. తక్షణమే వేతనాలు పెంచాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:26:36+05:30 IST