రాజకీయాల్లోకి బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్...త్వరలో బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2022-01-19T18:17:03+05:30 IST

దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తమ్ముడు కల్నల్ విజయ్ రావత్ ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరనున్నారు...

రాజకీయాల్లోకి బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్...త్వరలో బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ:  దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తమ్ముడు కల్నల్ విజయ్ రావత్ ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరనున్నారు. రిటైర్డు కల్నల్ విజయ్ రావత్ బుధవారం ఢిల్లీలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు.తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని ఢిల్లీలో కలిశానని, మరికొద్ది రోజుల్లో అధికారికంగా బీజేపీలో చేరతానని కల్నల్ విజయ్ రావత్ ప్రకటించారు. బీజేపీ అనుమతిస్తే 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కల్నల్ విజయ్ రావత్ చెప్పారు. ‘‘నేను బీజేపీ కోసం పనిచేయాలనుకుంటున్నాను. మా కుటుంబం భావజాలం బీజేపీది. బీజేపీ చెబితే నేనూ ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అని కల్నల్ విజయ్ రావత్ నివేదికలో పేర్కొన్నారు.  గతేడాది తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.


Updated Date - 2022-01-19T18:17:03+05:30 IST