Abn logo
May 20 2020 @ 17:02PM

జెనీలియా రీ ఎంట్రీ...?

హ‌..హ‌..హాసిని అంటూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న జెనీలియా గురించి ప్ర‌త్యేక పరిచ‌యం అక్క‌ర్లేదు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత జెనీలియా సినిమాల‌కు దూర‌మైంది. అయితే త్వ‌ర‌లోనే ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లూసిఫ‌ర్’ సినిమా రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో జెనీలియా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరు 153లో ఓ కీల‌క‌పాత్ర కోసం జెనీలియాను సంప్ర‌దించార‌ని టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement