KBC షో కు భర్త Riteish Deshmukhతో సహా వచ్చిన Genelia.. అమితాబ్ ప్లే చేసిన వీడియోను చూసి కంటతడి..!

ABN , First Publish Date - 2021-10-07T23:09:48+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రామ్ ఇప్పటికే ప్రజల హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంలో తాజా

KBC షో కు భర్త Riteish Deshmukhతో సహా వచ్చిన Genelia.. అమితాబ్ ప్లే చేసిన వీడియోను చూసి కంటతడి..!

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రామ్ ఇప్పటికే ప్రజల హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంలో తాజాగా నటి జెనీలియా ఆమె భర్తతో సహా పాల్గొంది. హాట్ సీట్‌ను భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి పంచుకున్న జెనీలియా.. బిగ్ బీ ప్లే చేసిన ఓ వీడియోను చూసి కంటతడి పెట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇప్పటికే కేబీసీ ప్రోగ్రామ్ 12 సీజన్లను పూర్తి చేసుకుంది. 13వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా నటి జెనీలియా ఆమె భర్త రితేష్ దేశ్‌బుక్‌తో సహా ప్రత్యేక అతిథిగా కేబీసీని విజిట్ చేశారు. జెనీలియాకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందకు రానుండగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోను సదరు చానల్ తన సోషల్ మీడియాలో విడుదల చేసింది.



అందులోని దృశ్యాల ప్రకారం.. చిన్న వయసులోనే క్యాన్సర్ బారినపడి ఆ మహమ్మారితో పోరాడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోను బిగ్ బీ కేబీసీలో ప్లే చేశారు. ఆ దృశ్యాలను చూసి.. జెనీలియాతోపాటు ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. పసివాళ్లను చూసి భార్యభర్తలు ఇద్దరూ కట్టతడి పెట్టారు. ప్రస్తుతం వారికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కేబీసీ షోలో గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ఈ దంపతులు కేటయించనున్నారు. 




Updated Date - 2021-10-07T23:09:48+05:30 IST