లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

ABN , First Publish Date - 2022-01-22T04:48:58+05:30 IST

అనుమతి లేకుండా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లు, వైద్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి ఎస్వీ రమణకుమారి హెచ్చరించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
వైద్యాధికారులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

  జిల్లా వైద్య శాఖాధికారి రమణకుమారి 

  రింగురోడ్డు: అనుమతి లేకుండా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లు, వైద్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి ఎస్వీ రమణకుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె చాంబరులో జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ కేంద్రాలు 14, ప్రైవేట్‌వి 77 ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా అనధికార లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆధారా లతో సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులకు రూ.లక్ష అందిస్తామన్నారు. అనుమతి లేని కేంద్రా లపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్లో ధరల పట్టిక ప్రదర్శనతో పాటు మాతృభాషలో ఇక్కడ ‘లింగ నిర్ధారణ పరీక్షలు చేయ బడవు ’ అనే బోర్డులు పెట్టాలని తెలిపారు. సమా వేశంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో రామ్మోహన్‌, డీటీసీవో డాక్టర్‌ రాణి సంయుక్త, పీవోడీడీటీ డాక్టర్‌ బారమురళీ కృష్ణ, డీఐసీ సంస్థ సభ్యులు  సీతారాం, నేచర్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు మీన పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-22T04:48:58+05:30 IST