సాగు చట్టాల్లో నల్లగా ఉన్నదేంటి? సిరా తప్ప : కేంద్ర మంత్రి వీకే సింగ్

ABN , First Publish Date - 2021-11-20T23:08:31+05:30 IST

సాగు చట్టాలను రాయడానికి వాడిన సిరా తప్ప,

సాగు చట్టాల్లో నల్లగా ఉన్నదేంటి? సిరా తప్ప : కేంద్ర మంత్రి వీకే సింగ్

బస్తీ (ఉత్తర ప్రదేశ్) : సాగు చట్టాలను రాయడానికి వాడిన సిరా తప్ప, వాటిలో నల్లగా ఉన్నదేమిటని కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ రైతులను ప్రశ్నించారు. కొందరు రైతులు ఈ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంపై విచారం వ్యక్తం చేశారు. తాను ఓ రైతు నేతను ఈ ప్రశ్న అడిగానని శనివారం తెలిపారు. 


వీకే సింగ్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, తాను ఓ రైతు నేతతో ఈ చట్టాల గురించి మాట్లాడానని తెలిపారు. ఇవి నల్ల చట్టాలు అని అంటున్నారు కదా? వీటిని రాయడానికి వాడిన సిరా తప్ప, నల్లగా ఏం ఉందని అడిగానన్నారు. దీనికి ఆ నేత స్పందిస్తూ, ‘‘మీ అభిప్రాయం మంచిదే కానీ, ఈ చట్టాలు ఇప్పటికీ నల్లవే’’ అన్నారని చెప్పారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటని తాను ప్రశ్నించినపుడు, పరిష్కారం ఏమీ లేదని ఆయన అన్నారని తెలిపారు. రైతు సంఘాల్లో ఆధిపత్య పోరు ఉందని, చిన్నకారు రైతుల ప్రయోజనాల గురించి వీరు ఆలోచించరని అన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేసినది బీజేపీయేనని చెప్పారు. రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.  


Updated Date - 2021-11-20T23:08:31+05:30 IST