Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 19 Sep 2021 16:37:49 IST

కాంగ్రెస్‌కు ద్రోహం చేయరు: కెప్టెన్‌పై గెహ్లోత్ విశ్వాసం

twitter-iconwatsapp-iconfb-icon
కాంగ్రెస్‌కు ద్రోహం చేయరు: కెప్టెన్‌పై గెహ్లోత్ విశ్వాసం

జైపూర్: పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీకి చేటు చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్‌కు గౌరవమైన వ్యక్తని, ఆయనను పార్టీ తొమ్మదిన్నరేళ్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆయన గుర్తు చేశారు. అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నట్లు వస్తున్న వార్తలపై అశోక్ గెహ్లోత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఎలాంటి చర్యలు కెప్టెన్ అమరీందర్ సింగ్ తీసుకోబోరని నాకు నమ్మకం ఉంది. కెప్టెన్‌ను కాంగ్రెస్ పార్టీ సీఎం చేసింది. దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆయనను సీఎంగా కొనసాగించింది. ఆయన కెప్టెన్సీ (నాయకత్వం), సేవలు పంజాబ్ ప్రజలకు ఉత్తమమైన ఫలితాల్ని అందించాయి. పార్టీలో ఆయన కీలక నేత, గౌరవనీయమైన వ్యక్తి. పార్టీ విధానాలకు ఆయన కట్టుబడి ఉంటారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం.. ఇక ముందు కూడా పార్టీలోనే కొనసాగుతారు’’ అని గెహ్లోత్ ట్వీట్ చేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.