Thane: కారులో మరోసారి మందుగుండు సామాగ్రి స్వాధీనం...ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-02-02T13:44:04+05:30 IST

థానే నగరంలో మంగళవారం రాత్రి మరోసారి కారులో మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

Thane: కారులో మరోసారి మందుగుండు సామాగ్రి స్వాధీనం...ముగ్గురి అరెస్ట్

థానే (మహారాష్ట్ర):థానే నగరంలో మంగళవారం రాత్రి మరోసారి కారులో మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థానే నగరంలో ఓ కారులో నుంచి 1,000 జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 25వతేదీన ముంబై నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఇంటి ముందు జెలటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ముగ్గురు వ్యక్తులు మారుతీ ఎకో కారులో మందుగుండు సామాగ్రిని తీసుకువెళుతుండగా నడినాకా వద్ద పోలీసులు పట్టుకున్నారు. జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లను తీసుకువెళుతున్న అల్పేష్ పాటిల్, పంకజ్ చవాన్, సమీర్ వేద్గాలను పోలీసులు అరెస్టు చేశారు. థానే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-02-02T13:44:04+05:30 IST