102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ బలప్రదర్శన

ABN , First Publish Date - 2020-07-13T21:56:29+05:30 IST

రాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది.

102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ బలప్రదర్శన

 జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది. కొద్ది సేపటి క్రితం సీఎల్పీ సమావేశం ముగిసింది. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. 102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ బలప్రదర్శన చేశారు. మరోవైపు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. సీఎల్సీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్ట్స్‌లకు తరలించారు.


ఇంకోవైపు సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను వీడబోరంటూ శివకుమార్ ప్రకటించారు. సచిన్ పైలట్‌తో అటు రాహుల్, ఇటు ప్రియాంక మాట్లాడారు. ఆవేశపడవద్దని సూచించారు. ఈ మొత్తం పరిణామాలకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఒక ప్రకటనలో ఆరోపించింది. రాజస్థాన్‌లో సుస్థిరమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించింది. 

Updated Date - 2020-07-13T21:56:29+05:30 IST