Abn logo
Jul 12 2020 @ 17:32PM

కాంగ్రెస్ అంటే గెహ్లాట్, గెహ్లాట్ అంటే కాంగ్రెస్: రాంపాల్

జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంపాల్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ అంటే గెహ్లాట్, గెహ్లాట్ అంటే కాంగ్రెస్’’ అని వ్యాఖ్యానించారు. గెహ్లాట్, పైలట్ వర్గీయుల మధ్య అంతర్గతంగా ఉన్న కలహాలు బహిరంగమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


‘‘రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి భయమూ లేదు. మా ప్రభుత్వం ప్రమాదంలో ఉందని వచ్చే వదంతులు నమ్మొద్దు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోనే రాజస్తాన్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుంది’’ అని రాంపాల్ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement