Sep 23 2021 @ 20:14PM

Gehana Vasisth: 113 రోజుల తర్వాత

బాలీవుడ్‌ అశ్లీల చిత్రాల కేసులో మోడల్‌, నటి గెహనా వశిష్ట్‌కు కాస్త ఊరట కలిగింది.  రాజ్‌ కుంద్రా నిర్మాణంలో అశ్లీల చిత్రాల్లో నటించిందనే ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. 133 రోజులుగా కస్టడీలో ఉన్న ఆమెకు దర్యాప్తునకు హాజరు కావాలనే షరతులతో కోర్టు బెయిల్‌ జారీ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్‌పై నటి గెహనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘‘షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను నమ్ముతున్నా. నన్ను ఎవరూ చెడ్డ దారి పట్టించలేదు. డబ్బు కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొంతమంది ఈ కేసులో ఇరికించారు’’ అని పేర్కొన్నారు. గతంలో ఆమె ముంబై హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో అపీల్‌ చేయగా ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల రాజ్‌కుంద్రాకు కూడా బెయిల్‌ దొరికిన సంగతి తెలిసిందే! Bollywoodమరిన్ని...