KBC షోలో సూపర్ ఛాన్స్ మిస్.. తెలియదని ఈమె వదిలేసిన రూ.7కోట్ల ప్రశ్న ఇదీ.. మీరు సమాధానం చెప్పగలరా..?

ABN , First Publish Date - 2021-11-11T19:11:39+05:30 IST

ప్రోమో చూసినప్పుడు..

KBC షోలో సూపర్ ఛాన్స్ మిస్.. తెలియదని ఈమె వదిలేసిన రూ.7కోట్ల ప్రశ్న ఇదీ.. మీరు సమాధానం చెప్పగలరా..?

ఇంటర్‌నెట్‌డెస్క్: ప్రోమో చూసినప్పుడు.. మొత్తానికి కేబీసీ సీజన్-13లో రూ.7కోట్లు గెలుచుకున్న వ్యక్తిని చూడబోతున్నామని సగటు ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ ఆ గృహిణికి అదృష్టం కలిసిరాలేదు. రూ.7కోట్ల ప్రశ్నప్పుడు కూడా ఆమె చేతిలో రెండు లైఫ్ లైన్లు ఉన్నాయంటే అర్థం చేసుకోండి.. ఆమె ఎంత గొప్పగా గేమ్ ఆడిందో. కానీ కేబీసీ నియమాల ప్రకారం.. చివరి ప్రశ్నకు లైఫ్ లైన్‌లను వినియోగించుకోరాదు. ఆమెకు కచ్చిత సమాధానం తెలియకపోవడంతో.. గెలుచుకున్న కోటి రూపాయలు తీసుకుని షో నుంచి నిష్క్రమించింది. కేబీసీ సీజన్-13లో కోటి రూపాయలు గెలిచిన మూడో వ్యక్తిగా నిలిచింది. అసలు విషయానికొస్తే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన గీతాసింగ్ గౌర్ ఓ సాధారణ గృహిణి. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలే ఆమె జీవితం. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యవహారిస్తున్న కేబీసీ ప్రోగ్రామ్‌‌లో గీతా పాల్గొంది.  గీతాసింగ్ గౌర్ గేమ్ ఆడిన విధానం చూసి ‘మహిళలకు అవకాశమిస్తే.. అద్భుతాలు స‌‌ృష్టిస్తారు’అని సగటు ప్రేక్షకుడు అనుకున్నాడు. ఆమె ఆట చూసి బిగ్ బీ కూడా ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతి ప్రశ్నకు సరైన జవాబు చెప్పడమే కాకుండా వాటి నేపథ్యాన్ని కూడా వివరించింది. అందుకే రూ.7కోట్ల ప్రశ్నకు సంబంధించిన ప్రోమో చూసినప్పడు.. ఈమె కచ్చితంగా రూ.7కోట్లు గెలుస్తుందని షో చూసే ప్రతి ఒక్కరూ అనుకున్నారు.


రూ.7కోట్ల ప్రశ్నగా గీతాసింగ్ గౌర్‌ను ఈ కింది ప్రశ్నను అడిగారు.

Which of these is not one of the names of three of Akbar's grandsons when they were briefly converted to Christianity after being handed over to Jesuit priests:


A. Don Felipe

B. Don Henrique

C. Don Carlos

D. Don Francisco


అయితే గీతాసింగ్ గౌర్‌కు సరైన సమాధానం తెలియలేదు. చేతిలో రెండు లైఫ్ లైన్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే అవకాశం లేదు. దీంతో ఆమె క్విట్ అని చెప్పింది. క్విట్ అయ్యే ముందు ఏదైనా సమాధానం చెప్పమని అమితాబ్ అడగ్గా.. ఆమె బి సమాధానంగా చెప్పింది. కానీ సరైన సమాధానం డి. 


గీతా క్విట్ చెబుతుందని ఊహించని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. చివరికి ఆమె రూ.1కోటి తీసుకుని షో నుంచి వెనుదిరిగారు. కానీ గీతాసింగ్ గౌర్.. షో చూసిన ప్రతి ఒక్కరి మనస్సును గెలుచుకుంది. ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా అనే టీచర్, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న షాహిల్ అహిర్‌వాల్ ఇంతకుముందే ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-11-11T19:11:39+05:30 IST