వరాలిచ్చే గీసుగొండ నారసింహుడు..

ABN , First Publish Date - 2022-01-14T05:53:32+05:30 IST

వరాలిచ్చే గీసుగొండ నారసింహుడు..

వరాలిచ్చే గీసుగొండ నారసింహుడు..

రేపటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు,

15న కల్యాణోత్సవం 17న బండ్ల ప్రదక్షిణ 


గీసుగొండ, జనవరి 12: కోరిన కోర్కెలు తీర్చే కొం గు బంగారమైన గీసుగొండ లక్ష్మీనరసింహస్వామి జాతర ఈనెల 15 నుంచి 19 వరకు వైభవంగా జర గనుంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గీసుగొండ గుట్ట 100 ఎకరాల విస్తీ ర్ణంలో, 300అడుగుల ఎత్తులో ఉంటుంది.  


15 నుంచి బ్రహ్మోత్సవాలు

లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు అర్చ కులు వేదాంత మురళికృష్ణమాచార్యులు, వెంకట నర్సింహచార్యులు తెలిపారు. 15న గ్రామంలోని ఆల యం నుంచి గుట్టపైకి ఉత్సవమూర్తుల తరలింపు, కల్యాణోత్సవం, 16న హోమ బలిహరణం, 17న రా త్రి బండ్లు తిరుగుట, మొక్కుల చెల్లింపు, 18న కేశఖండనాలు, పుష్పయాగం, 19న గ్రామ ఆల యానికి ఉత్సవమూర్తుల తరలింపు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 

ఇలా వెళ్లవచ్చు.. 

వరంగల్‌ నగరానికి 10కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటానికి గొర్రె కుంట, పోతరాజుపల్లి మీదుగా రోడ్డు ఉంది. అలాగే కోట గండి సాయిబాబా ఆలయం నుంచి, ఏనుమాముల మార్కెట్‌ నుంచి మొగిలిచర్ల మీదుగా, అక్కెంపేట, బాలయ్యపల్లి మీదుగా, అలాగే గీసుగొండ నుంచి బీటీ రోడ్లు ఉన్నాయి. దైవదర్శనం అనంతరం ఎత్తైన ఆలయ గుట్టపై నుంచి భక్తులు చుట్టూ ఉన్న పరి సరాలను వీక్షిస్తూ పరవశించిపోతారు.

Updated Date - 2022-01-14T05:53:32+05:30 IST