పదకొండేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

ABN , First Publish Date - 2020-05-30T01:28:24+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు పదకొండేళ్ళ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం... 2019 - 20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 3.1 గా నమోదైంది.

పదకొండేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు పదకొండేళ్ళ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం... 2019 - 20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 3.1 గా నమోదైంది.


గతేడాది ఇదే త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.1 గా ఉన్న జీడీపీ వృద్ధిరేటు తదుపరి ఆర్థిక సంవత్సరంలో 4.2 గా నమోదైంది. కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం భారత్‌పైనా పడింది. ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్‌లో మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-30T01:28:24+05:30 IST