జీడీకే ఓసీపీ5 పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-04-21T05:42:37+05:30 IST

ఆర్‌జీ-1 పరిధిలో నూతనం గా చేపట్టబోయే జీడీకే ఓసీపీ5కి సంబంధించిన పనుల ను వేగవంతం చేయాలని డైరెక్టర్‌(ఆపరేషన్స్‌, పా) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌(పీపీ, ఫైనాన్స్‌) బలరాం, డైరెక్టర్‌ (ఈ అండ్‌ఎం) సత్యనారాయణ ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణకు సూచించారు.

జీడీకే ఓసీపీ5 పనులను వేగవంతం చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఆర్‌జీ-1 జీఎం నారాయణ

- వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్ల సూచన

గోదావరిఖని, ఏప్రిల్‌ 20: ఆర్‌జీ-1 పరిధిలో నూతనం గా చేపట్టబోయే జీడీకే ఓసీపీ5కి సంబంధించిన పనుల ను వేగవంతం చేయాలని డైరెక్టర్‌(ఆపరేషన్స్‌, పా) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌(పీపీ, ఫైనాన్స్‌) బలరాం, డైరెక్టర్‌ (ఈ అండ్‌ఎం) సత్యనారాయణ ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణకు సూచించారు. సోమవారం నూతన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతిపై జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నూతనంగా చేపట్టబోయే ప్రాజెక్టుల అనుమతులు, రోడ్ల నిర్మాణ పనులు, భూసేకరణ అనుమతులు, తదితర అంశాలపై చర్చించారు. పనుల పురోగతి, రోడ్ల నిర్మాణం, నాలా మళ్లింపులు, ప్రభుత్వం నుంచి పొందే అనుమతులపై జీఎంతో చర్చించారు. సంస్థ అభివృద్ధికి, పురోగతికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో మేడిపల్లి పీఓ సత్యనారాయణ, ఏరి యా సర్వే అధికారి సరోత్తం పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:42:37+05:30 IST