Abn logo
May 15 2021 @ 23:55PM

ఆన్‌లైన్‌లో జీడీఏ కోర్సు శిక్షణ

గుజరాతీపేట, మే 15: బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, టెక్‌ మహేంద్ర సంస్థల ఆధ్వ ర్యంలో జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌(జీడీఏ) కోర్సుకు సంబంధించి మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ అధిపతి సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఆస్పత్రుల్లో ఉపాధి కల్పించి మంచి జీతం అందిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత/ఫెయిల్‌ అయిన విద్యార్థులు అర్హులన్నారు. 30 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు అభ్యర్థు లైనా 14 రకాల డిప్లమో పారామెడికల్‌ కోర్సుల్లో చేరవచ్చునన్నారు. డీఎంపీ హెచ్‌ఏ, డీడీఐఏఎల్‌వై, డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీవోఎం, డీవోఏ, డీఏఎన్‌ఎస్‌, డీఈసీజీ, డీసీఏఆర్‌డీఐవో, డీసీఐటీ, డీఎంఎస్‌టీ, డీఆర్‌ఈఎస్‌టీ, డీడీఆర్‌ఏ తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్టు చెప్పారు.  ఆసక్తి కలిగిన యువతీ యువకులు 768094357, 7337330138 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

 

Advertisement