ఘనంగా గ్యార్మీ పండుగ

ABN , First Publish Date - 2020-12-05T05:08:12+05:30 IST

మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం గ్యార్మీ పండు గను శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

ఘనంగా గ్యార్మీ పండుగ
గ్యార్మీ పండుగ సందర్భంగా లింగాలలో జెండాల ఊరేగింపు

లింగాల, డిసెంబరు 4: మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం గ్యార్మీ పండు గను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని దూదేకుల కులస్తులు ప్రతిఏటా ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా గ్రామంలోని సంగం మిద్దె వద్ద నుంచి ండాలు పట్టుకొని పీర్ల చావిడి వద్ద ఉన్న దస్తగిరి స్వామి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కులమతాల బేధాలు లేకుండా అందరు స్వామివారికి చక్కెర చదివింపులు చదివించారు. అనంతరం గ్రామస్థులు అందరికి మాంసాహార విందు ఏర్పాటుచేశారు.

Updated Date - 2020-12-05T05:08:12+05:30 IST