రుణదాతలతో గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-03-27T05:43:18+05:30 IST

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రిసొల్యూషన్‌ ప్రక్రియలో భాగంగా కంపెనీతో రుణదాతల కన్సార్షియం.. ..

రుణదాతలతో గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రిసొల్యూషన్‌ ప్రక్రియలో భాగంగా కంపెనీతో రుణదాతల కన్సార్షియం.. ఇంటర్‌-క్రెడిటార్‌ అగ్రిమెంట్‌ (ఐసీఏ) కుదుర్చుకుంది. ఇందులోభాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆధ్వర్యంలో రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవు. రుణాల తిరిగి చెల్లింపు ప్రక్రియ సరళంగా సాగుతుంది. ప్రభుత్వం, ఇతర వర్గాల నుంచి కంపెనీకి రావాల్సిన నగదులో జాప్యం కారణంగా గాయత్రీ ప్రాజెక్ట్స్‌ కొద్దినెలలుగా నిధుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో రుణ వాయిదాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ప్రతి నెలా రుణదాతలకు కంపెనీ సగటున రూ.35-40 కోట్లు చెల్లించాల్సి ఉంది. బ్యాం కు గ్యారంటీలకు సంబంధించి ఇటీవల ఆర్బిట్రల్‌ అవార్డులు కంపెనీకి అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నాలుగు నెలల్లో గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు రూ.406 కోట్లు సమకూరే వీలుంది. 

Updated Date - 2020-03-27T05:43:18+05:30 IST