Abn logo
Sep 21 2021 @ 00:51AM

జర్మనీ అగ్నిప్రమాదంలో బాపట్ల దంపతులకు గాయాలు

తాళ్ళూరి భాస్కర్‌, పుష్ప

బాపట్ల, సెప్టెంబరు 20: బాపట్లకు చెందిన తాళ్ళూరి భాస్కర్‌, ఆయన భార్య  పుష్పభవానీ  దంపతులు జర్మనీలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.  బాపట్ల పట్టణానికి చెందిన తాళ్ళూరి శివయ్య, పార్వతి దంపతుల  పెద్దకుమారుడు భాస్కరరావు ఆరేళ్ళ క్రితం జర్మనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం నిమిత్తం వెళ్ళాడు. ఆయన భార్య పుష్పభవానీ హౌస్‌ వైఫ్‌గా ఉంది. ఇరువురు ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు  అక్కడ నుంచి రూరల్‌ పోలీసులకు  సమాచారం అందింది.  వారి పరిస్థితి ఎలా ఉందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. భాస్కర్‌ తల్లితండ్రులు ప్రస్తుతం గుంటూరులోని కుమార్తె ఇంటిలో వున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.